మరికొద్ది గంటల్లో రజనీకాంత్ నటించిన "కూలీ" సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా చూడటానికి చిన్నా, పెద్దా, ముసలి వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. "ఎలాగైనా సరే రజనీకాంత్ నటించిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి" అంటూ ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఫస్ట్ బొమ్మ పడబోతోంది .. ఆల్మోస్ట్ ఆల్, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న టాక్ కూడా బయటకు వచ్చింది.


ఇలాంటి సమయంలో కొన్ని థియేటర్లు స్పెషల్ నోట్ రిలీజ్ చేశాయి. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులను హెచ్చరించాయి. కూలీ సినిమాకు సెన్సార్ బోర్డు "ఏ" సర్టిఫికేట్ జారీ చేసింది అనేది అందరికీ తెలిసిందే. దీంతో, తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల యాజమాన్యం థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు పలు సూచనలు జారీ చేసింది. ఈ సినిమాకు 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి అనుమతి లేదని అఫీషియల్‌గా ప్రకటించింది. అలాగే, వయసు నిరూపించే ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కోరింది. ఎవరు 18 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్‌కు తీసుకువస్తే లోపలికి అనుమతించబోమని ప్రెస్ నోట్ విడుదల చేసింది. .



సోషల్ మీడియాలో ఈ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్‌కి చిన్నపిల్లలూ ఫ్యాన్స్‌గానే ఉంటారు. ఇది చాలా మందికి తెలుసు, ముఖ్యంగా 10, 12, 15 ఏళ్ల పిల్లలు ఎక్కువగా ఆయన సినిమాలను లైక్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇది నిరాశ కలిగించింది. అయితే సినిమా కి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల పిల్లల విషయంలో ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి "కూలీ" సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో. .



మరింత సమాచారం తెలుసుకోండి: