సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ఆఖరు ఆరు మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. రజనీ కాంత్ కొంత కాలం క్రితం వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజినీ కాంత్ హీరో గా రూపొందిన జైలర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం పెద్దన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నయన తార , రజనీ కాంత్ కి జోడిగా నటించింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం పేట అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: