ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నతో మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అసలు ఏమి జరుగుతోంది? ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఉన్న స్టార్‌లు నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఏ రకమైన ఫలితం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు కూలీ, వార్ 2 కూడా ఇంచుమించు అలాంటి మిశ్రమ స్పందననే సంపాదించాయి. కలెక్షన్స్ పరంగా కూలీ సినిమా మొదట జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లినా, ఆ ఊపుని టాక్ విషయంలో కొనసాగించలేకపోయింది. అదే విధంగా వార్ 2 విషయంలోనూ, జూనియర్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా సరే, సినిమా ఆశించిన స్థాయి టాక్ దక్కించుకోలేదు. ఈ పరిస్థితి ఫ్యాన్స్‌కు జీర్ణించుకోవడం కష్టంగా మారింది.


ఇండస్ట్రీలో అసలు ఏమి జరుగుతోందనే చర్చలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. కావాలనే వ్యక్తిగత విభేదాలను ఇండస్ట్రీపై రుద్దుతూ, ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం వల్ల కూడా సినిమాల ఫలితాలపై ప్రభావం పడుతోందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చిన్న సినిమాలు మాత్రం సాఫీగా హిట్ అవుతున్నాయి. కానీ భారీ కాన్సెప్ట్‌లు, భారీ బడ్జెట్‌లతో వచ్చిన పెద్ద సినిమాలు మాత్రం ఎక్కువగా డిజాస్టర్ టాక్‌ను ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణం ఏమిటి అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కొంతమంది ..ఫ్యాన్స్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని అంటుంటే, మరికొంతమంది మాత్రం – కంటెంట్ బాగుంటే ఏ స్టార్ నటించినా సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు అని అంటున్నారు.



 డైరెక్టర్లు, మేకర్స్ తమ తర్వాతి సినిమాల్లో కొత్తదనం చూపించి ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఈ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మిగతా బాష లల్లో హీరోల మధ్య  గ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా అవి సినిమాలకి పట్టించుకోరు. కానీ తెలుగు హీరోల ఫ్యాన్స్ మాత్రం కూసింత గట్టిగానె ఆలోచించి టాలెంట్ ఉన్న హీరో సినిమాలని తొక్కేస్తున్నారు అనే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: