
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హైప్ తెచ్చుకున్న రెండు భారీ సినిమాలు “వార్ 2” మరియు “కూలీ” లు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ ముందు నుంచే ఈ రెండు సినిమాల కు మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ఒకేసారి క్లాష్ అవ్వడంతో ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది. డబ్బింగ్ సినిమాలే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండింటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే, వసూళ్ల పరంగా చూస్తే రజనీకాంత్ నటించిన “కూలీ” అంచనాలకు మించి డామినేషన్ చూపిస్తోందని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా నైజాం మార్కెట్ విషయానికి వస్తే, “వార్ 2” కంటే “కూలీ” టాప్‌లో దూసుకెళ్తోంది. మొదటి రోజు నుంచే మంచి ఫిగర్స్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు వసూళ్లలోనూ “వార్ 2” ను వెనక్కి నెట్టింది. ఇక మూడో రోజు లెక్కల్లోనూ ఇదే ఫీట్ కొనసాగించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాం లో “కూలీ” డే 3కి దాదాపు 2.65 కోట్ల షేర్ సాధించగా, “వార్ 2” మాత్రం 1.65 కోట్ల షేర్ వద్దే ఆగిపోయింది. అంటే రెండు సినిమాల మధ్య దాదాపు 1 కోటి తేడా వచ్చింది.
ఇది రజనీకాంత్ క్రేజ్, సౌత్ మార్కెట్‌లో ఆయనకున్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసింది. హృతిక్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన “వార్ 2” కూడా మంచి హైప్‌ను క్రియేట్ చేసినప్పటికీ, వసూళ్ల పరంగా “కూలీ” రేంజ్‌ను అందుకోలేకపోయింది. ఈ దశలో “కూలీ” ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తోందని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు