
వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు కూడా లెజెండ్రీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా మంచు మూడో తరం అవ్రామ్, తన తాత (డా. మోహన్ బాబు మంచు) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వీరితో పాటు కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ మురళీమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ గారి కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియా, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
అంతేకాకుండా ఓటిటి విభాగంలో సిరీస్ నైన్టీస్ (ETV Win), హాసన్ (నైన్టీస్), రోహన్ రాయ్ (నైన్టీస్), నటి జోర్దార్ సుజాత వంటి వారు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి మహత్తర కార్యక్రమానికి సహకారం అందించిన .మ్యూజిక్ పార్టనర్ ఆదిత్య మ్యూజిక్. పోవెర్డ్ బై స్పాన్సర్ గా సూర్య సిమ్ మినీ స్పాన్సర్స్, సంధ్య సిల్క్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కుబేర సిల్క్స్ ,శ్రీ విజయ్ వారాహి మూవీస్. కో - స్పాన్సర్ : వెన్లక్స్ , డి ఎన్ సి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లోగో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వివికే హోసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బ్రాండింగ్ పార్టనర్ మహారత్న గ్రూప్ . ఫిట్డే మరియు ఎస్ వివిఏ & ఎస్ట్యూరీ ఇలా 24వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కి స్పాన్సర్ గా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు సురేష్ కొండెటి.