
అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడం పై నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు ప్రారంభం నుంచి అనుష్క ప్రమోషన్స్ లో ఉండరని చెప్పారని అది ఆమె వ్యక్తిగత విషయమని దానిని మేము గౌరవిస్తున్నాము.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావచ్చు, రాకపోవచ్చు .. కానీ అనుష్క లాంటి వారు మాత్రమే ఇలాంటి గొప్ప పాత్రలు పోషించగలరంటూ తెలిపారు. షీలా పాత్రలో ఆమె జీవించేసింది. ఆ పాత్రను అనుష్క తప్ప మరెవరు కూడా సినిమా చూసిన తర్వాత మనం ఊహించుకోలేమంటూ తెలిపారు. ఆమెకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేసామర్థ్యం కూడా ఉందని తాము నమ్మామని తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఆంధ్రా , ఒడిశా సరిహద్దులలోనే పూర్తి చేశామని వెల్లడించారు. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఒక మారుమూల ప్రాంతంలో తెల్లవారుజామున ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అనుష్కను చూడడానికి సుమారుగా 2000 మంది జనాలు వచ్చారని అక్కడ లాఠీ ఛార్జ్ కూడా జరిగిందంటూ తెలిపారు నిర్మాత రాజీవ్ రెడ్డి. ఒకవేళ ఇక్కడ చేసి ఉంటే జనాలను అదుపు చేయలేమని కూడా తెలిపారు. ఇందులో విక్రమ్ ప్రభు, అనుష్క ఇద్దరు కూడా స్మగ్లింగ్ చేస్తే ఘాటిలుగా నటించారని..అలా చేస్తున్న పనిని తప్పని తెలుసుకొని..గంజాయి నడిపించే వ్యవస్థ పైన తిరుగుబాటు చేస్తారు..అలా వారికి ఎదురైన సవాళ్లు? ఏంటి అనేది ఈ సినిమా కథ అంటూ తెలిపారు రాజీవ్ రెడ్డి..
అనుష్క ఘాటి సినిమా ప్రమోషన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాదనే విషయం అభిమానులకు తెలియగానే నిరాశపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. అనుష్కనే రాకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు?.. మరి కొంతమంది మాత్రం అనుష్క వల్లే సినిమా నడుస్తుందని.. ప్రమోషన్స్ లో పాల్గొనకపోతే ఆమె సినిమా ఫలితానికి మైనస్ గా మారేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.