ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా పెరిగిపోయింది. ఎక్కువ శాతం ఏదైనా హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆయన నటించిన ఏదో ఒక సినిమాను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఆ హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుడు నటించిన సినిమాను పుట్టిన రోజు థియేటర్లలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కొంత మంది కామన్ ఆడియన్స్ కూడా ఆ సినిమాను చూడడం వల్ల కొన్ని సినిమాలకు భాగంగా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన పౌర్ణమి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో త్రిష , చార్మి హీరోయిన్లుగా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. 

ఇకపోతే ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను సెప్టెంబర్ 19 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్టు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: