
భోజ్పురి ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా పేరు సంపాదించిన పవన్ సింగ్ ఒక ఈవెంట్ లో పాల్గొనగా.. అక్కడ హీరోయిన్ అంజలి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉండగా.. ఆమె నడుమును తాకి ఏదో ఆమెతో చెప్పినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది . అయితే హీరోయిన్ అంజలి మాత్రం ఆ హీరో అలా తాకడంతో అసౌకర్యంగా ఫీల్ అయినా కూడా.. ఆ భావాలను ముఖంలో చూపించకుండా కేవలం నవ్వుతూనే కనిపిస్తూ ఉన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. కాని పవన్ సింగ్ మాత్రం పదేపదే హీరోయిన్ అంజలి నడుమును తాకుతూ ఏదో శుభ్రం చేస్తున్నట్లుగా కనిపించారు.
ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ అంజలి నడుమును స్టేజ్ మీద ఇలా అసభ్యకరంగా తాకడంతో ఆమె ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్స్ సైతం ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా తమ తోటి హీరోయిన్ తో ఇలా ప్రవర్తించడం ఏంటి అంటూ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అంజలి అభిమానులు మాత్రం వెంటనే ఆ హీరో క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తానికి అక్కడ ఏం జరిగిందనే విషయంపై హీరో పవన్ సింగ్ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై పవన్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.