- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత .. అల్లు అరవింద్ మాతృమూర్తి, ఇటు మెగాస్టార్ చిరంజీవికి అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె కొంత కాలంగా వ‌యోః భారం స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, సురేఖ ఉదయాన్నే అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకుని ఆమెకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగానూ త‌న అత్త కనకరత్నమ్మకు నివాళి అర్పించారు. అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరు త‌న అత్త‌య్య తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని నెమ‌ర వేసుకున్నారు. ‘మా అత్తయ్యగారు కీ.శే అల్లు రామలింగయ్యగారి సతీమణి కనకరత్నమ్మగారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’ అని ఎక్స్‌లో త‌న సంతాపాన్ని తెలిపారు.


ఇక నాన‌మ్మ మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న బ‌న్నీ ముంబై నుంచే మ‌ధ్యాహ్యానికి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. ఇటు పెద్ది సినిమా షూటింగ్ లో మైసూర్ లో ఉన్న రామ్ చ‌ర‌ణ్ కూడా అమ్మ‌మ్మ కు నివాళి అర్పించేందుకు హైద‌రాబాద్ రానున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు వైజాగ్ మీటింగ్‌లో బిజీగా ఉండ‌డంతో రేపు అల్లు ఫ్యామిలీని పరామ‌ర్శించ నున్నారు. ఇక మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకుంటున్నారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: