ఇండియన్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ ఇండియా తరఫున ఎన్నో వన్డే , టెస్ట్ , టీ 20 గేమ్లను ఆడి అన్ని ఫార్మేట్ లలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఇండియాకు ఎన్నో విజయాలను అందించడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. కోహ్లీ ఐ పి ఎల్ లో బెంగళూరు తరఫున ఆడి ఆ జట్టుకు కూడా ఎన్నో గెలుపులను అందించాడు. ఇలా కోహ్లీ దాదాపు అన్ని ఫార్మేట్లను ఆడి , అన్ని ఫార్మేట్ లలో కూడా అద్భుతమైన ఆట తీరును కనబరిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అలాగే తన ఆట తీరుతో అభిమానులను ఎంత గానో అలరించాడు. కోహ్లీ లాంటి స్టార్ ఈమేజ్ కలిగిన క్రికెటర్ ఏ హీరోను అభిమానిస్తాడా ..? అని తెలుసుకోవాలి అనే  ఆసక్తి కూడా చాలా మంది జనాల్లో ఉంటుంది. తాజాగా కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కోహ్లీ తనకు అత్యంత ఇష్టమైన టాలీవుడ్ నటుడు ఎవరు అనే దాని గురించి స్పందించాడు. తాజాగా కోహ్లీ స్పందిస్తూ ... నాకు తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. నటుడిగా ఆయనను నేను ఎంత గానో అభిమానిస్తూ ఉంటాను.

కొంత కాలం క్రితం ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో నటించాడు. ఆ సినిమాలోని ఆయన నటనను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఇక వారు ఆస్కార్ అందుకున్నారు అని తెలియగానే నేను నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరిచాను అని కోహ్లీ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా కోహ్లీ తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: