బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ముద్దుగుమ్మలు మన తెలుగు సినిమాల్లో నటించడానికి కొన్ని సంవత్సరాల క్రితం పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు ప్రధాన కారణం బాలీవుడ్ ఇండస్ట్రీ తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ ఆ సమయంలో చాలా చిన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇచ్చే పారితోషకాలతో పోలిస్తే తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు ఇచ్చే పారితోషకాలు కూడా చాలా తక్కువ. దానితో బ్యూటీలు ఎక్కువ శాతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారు తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.

కొంత మంది స్టార్ నిర్మాతలు కాస్త ఎక్కువ డబ్బులు పోయినా పర్లేదు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఓ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో నాలుగు సినిమాలు చేసింది. కానీ ఆ నాలుగు సినిమాలు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఇంతకు నాలుగు తెలుగు సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శిల్పా శెట్టి. 

మొదటగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె మోహన్ బాబు హీరోగా రూపొందిన వీడెవడండీ బాబు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె నాగార్జున హీరో గా రూపొందిన ఆజాద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఆఖరుగా ఈమె తెలుగులో బాలకృష్ణ హీరోగా రూపొందిన భలేవాడివి బాసు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ఈమెకు ఫెయిల్యూర్ దక్కింది. ఇలా ఈమె తెలుగులో నాలుగు సినిమాల్లో నటిస్తే ఆ నాలుగు సినిమాలో కూడా అపజాయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: