నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. సోషల్ మీడియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రచ్చరంబోలా క్రియేట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఓ రేంజ్‌లో హంగామా చేస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌కి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.

పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో తప్పనిసరిగా హీరోయిన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. సినిమాకి హీరో టచ్ ఎంత ముఖ్యమో, గ్లామర్ టచ్ కూడా అంతే ముఖ్యమని భావిస్తారు. డిఫరెంట్ హీరోయిన్స్‌కు లైఫ్ ఇవ్వడానికి, వాళ్లతో స్క్రీన్‌పైన నటించడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అయితే, ఒక సినిమాలో మాత్రం ఆయనకు హీరోయిన్ లేరు. కానీ ఆ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కేవలం సెంటిమెంట్‌పై ఆధారపడి, హీరోయిన్స్ లేకుండా కూడా పవన్ కళ్యాణ్ తన ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు ‘బంగారం’.

ఈ సినిమాకి ధరణి రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ పాత్ర లేదు. మీరా చోప్రా లీడ్ ఫిమేల్ క్యారెక్టర్‌గా నటించినా, ఆమె పవన్ కళ్యాణ్‌కి హీరోయిన్ కాదు. రీమా సేన్ కూడా సినిమాలో ఎక్కడికక్కడ మెరిసినా, హీరోయిన్‌ అని చెప్పుకోలేం. చివర్లో త్రిషను గెస్ట్ రోల్‌లో తీసుకొచ్చి డైరెక్టర్ అలా మెరిసేలా చేశారు. ఈ సినిమాలో ఎక్కడా పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సీన్లు లేకుండా, గ్లామర్ టచ్ లేకుండా, కేవలం సెంటిమెంట్ యాంగిల్‌ను హైలైట్ చేస్తూ కథను తెరకెక్కించారు.

అందుకే ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించింది. అభిమానులను ప్రత్యేకంగా అలరించింది. పవన్ కళ్యాణ్‌లోని డిఫరెంట్ యాంగిల్‌ను చూపించింది. ‘బంగారం’ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తారు. అభిమానుల విషయానికి వస్తే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ‘రా రా బంగారం’ పాట వస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌కి మంచి బూస్ట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: