
అటు పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానుల సైతం పెద్ద ఎత్తున పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మొదటిసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, బద్రి, ఖుషీ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. జల్సా, బంగారం వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్లీ సక్సెస్ అందుకోవడానికి సుమారుగా 11 ఏళ్లు పట్టింది ఆ సినిమానే గబ్బర్ సింగ్. అప్పటివరకు ఉన్న ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్సుగా మారిపోయి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ ,నడిచే విధానం ఒక ట్రెండ్ సెట్ చేశాయని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్స్ సంపాదించాడో అన్నే ఫ్లాపులను కూడా సంపాదించారు. టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న హీరోగా పేరు సంపాదించిన పవన్ కళ్యాణ్.. రాజకీయాలలోకి వచ్చే ముందు వరకు పెద్దగా ఎక్కడ అభిమానులను కలిసేవారు కాదు. మీడియాకు కూడా దూరంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ అవార్డులు కూడా చాలా తక్కువగానే వస్తూ ఉండేవి. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఎక్కువగా తన సినిమాలలో వాటినే ఉపయోగించేవారు. అలా సపరేట్ క్రేజ్ సంపాదించారు.
పవన్ కళ్యాణ్ చేసే పనిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం వల్లే రాజకీయాలలో కూడా సక్సెస్ అయ్యారు.
ఒకానొక సమయంలో 2002లో ఇంద్ర సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ సక్సెస్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కుదరలేదని చెప్పడంతో పెద్ద ఎత్తున అభిమానులు 5 నిమిషాల పాటు అరుపులు ,కేకలతో రచ్చ చేశారు అప్పట్లోనే అలాంటి క్రేజ్ ఉండేది.
మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నను మించి మరి క్రేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఎంత ఎదిగిన ఒదిగే ఉంటారు.
సినిమాలలో చూడాల్సిన స్టార్ డమ్ అతి తక్కువ సమయంలోనే చూసి సాధించాల్సిన ప్రజాభిమానం కూడా సాధించేశారు. సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని CMPF స్థాపించారు.
తన అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీ సపోర్టు చేసిన కొన్ని కారణాల చేత ఆ పార్టీ కనుమరుగయ్యింది. మళ్లీ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని కుటుంబాన్ని లగ్జరీ లైఫ్ ను వదిలి జనసేన పార్టీని స్థాపించారు.
విడిపోయిన రాష్ట్రానికి (ఏపీ) రాజధాని లేదని డెవలప్మెంట్ లేదని వీటన్నిటిని అభివృద్ధి చేసి పార్టీలకు సపోర్టుగా నిలిచారు. తనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటికి తీస్తూ పల్లెల్లో తిరిగారు. ప్రతిచోట ఉన్న సమస్యను తెలుసుకునేందుకు జనసైనికుడుగా మారారు. రాజకీయాలలో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు.
ఏపీ రాజకీయాల చరిత్రలో 2024లో సరికొత్త చరిత్రను సృష్టించారు. పోటీ చేసిన అన్నిచోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ ని సంపాదించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ జనాల కోసం మళ్లీ నిలబడ్డారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఏకంగా దేశ ప్రధానితోనే మంచి స్నేహబంధం కలిగి ఉన్న నాయకుడిగా పేరు సంపాదించారు పవన్ కల్యాణ్.
రాజకీయాల పరంగా, అటు పర్సనల్ లైఫ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజకీయాలలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, తప్పుడు పనులు ఒకే చెప్పని నాయకుడుగా అభిమానుల హృదయాలలో పేరు సంపాదించారు.