గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది మన తెలుగు సినిమాల్లో తెలుగు ముద్దుగుమ్మలకు అవకాశాలు కరువయ్యాయి. పక్క రాష్ట్రాల నుండి వస్తున్న వారికి అవకాశాలు ఇస్తున్నారు. వారికే కోట్లలో పారితోషకాలు ఇస్తున్నారు. మన తెలుగు వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. మన తెలుగు వారికి హీరోయిన్ అవకాశాలు ఇచ్చినట్లయితే తెలుగు సినీ పరిశ్రమ మరింత ముందుకు సాగుతుంది అనే వాదనను అనేక మంది అనేక సందర్భాలలో వినిపించారు. ఇకపోతే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు వారు సినిమా ఇండస్ట్రీ లోకి బాగానే ఎంట్రీ ఇస్తున్నారు. అందులో ఒకరు ఇద్దరు సక్సెస్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలలో , అద్భుతమైన క్రేజ్ కలిగిన మూవీలలో అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడి పోతున్నారు. 

ఇకపోతే తెలుగు అమ్మాయి అయినటువంటి ఈషా రెబ్బ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తన అందంతో , నటనతో ఎన్నో సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈమెకు అడపా దడపా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. తెలుగు అమ్మాయి అయినటువంటి ప్రియాంక జవాల్కర్ ఇప్పటివరకు తక్కువ సినిమాల్లోనే నటించిన ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు మంచి విజాయాలను అందుకున్నాయి.

ఈమె నటించిన సినిమాల్లో తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈమెకు కూడా చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కానీ స్టార్ హీరోల సినిమాలలో , అద్భుతమైన క్రేజ్ కలిగిన సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. ఇలా వీరిద్దరితో పాటు మరి కొంత మంది తెలుగు అమ్మాయిలు కూడా సినిమా ఇండస్ట్రీ లో ముందుకు సాగుతున్న అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: