
కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ "చంటి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మీనా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట హీరో గా వెంకటేష్ ను అనుకోలేదట. బాలకృష్ణ ను ఈ సినిమాలో మొదట హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించగా ... కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో ఈ మూవీ ని వెంకటేష్ పై రూపొందించినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం సూర్యవంశం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వెంకటేష్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్ర లో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా నటించి ప్రేక్షకులను తన నటనతో అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కూడా మొదట బాలకృష్ణ ను హీరో గా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ ఆ సినిమా చేయలేను అని చెప్పడంతో వెంకటేష్ ను ఈ మూవీ లో హీరో గా తీసుకున్నారట. ఇలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలతో వెంకటేష్ కు అద్భుతమైన విజయాలు దక్కినట్లు తెలుస్తోంది.