వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 7న ఈ షో గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఈసారి హౌస్ లోకి కామనర్స్ వెళ్లడం కాస్త ఆసక్తి కలిగించే విషయం అయినప్పటికీ హౌస్ లోకి సెలబ్రిటీలు అంతా పేరున్నవాళ్లు రాలేదని కొంత మంది పెదవి విరుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటినుండి ప్రతి సీజన్లో ఎప్పుడు ఏదో ఒక లవ్ ట్రాక్ కచ్చితంగా ఉంటుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లలో ప్రతి ఒక్క సీజన్లో లవ్ ట్రాక్ నడిచింది.అయితే తాజాగా స్టార్ట్ అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా లవ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఎవరెవరి మధ్య లవ్ స్టార్ట్ అయింది అనేది చూస్తే.. బుల్లితెర షో ద్వారా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించిన యాంకర్ రీతు చౌదరి అంటే తెలియని వారు ఉండరు.

అయితే హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయింది.అలా సోషల్ మీడియా పాపులారిటీ,బుల్లితెర క్రేజ్ ఇవన్నీ రీతూ చౌదరికి కలిసి రావడంతో బిగ్ బాస్ సీజన్ 9 లో అవకాశం అందుకుంది. ఇక ఈ సీజన్లో రీతూ చౌదరి పవన్ కళ్యాణ్ పడాల మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. కామనర్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ పడాల రీతూ చౌదరి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ రొమాంటిక్ గా నిల్చున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో లవ్ ట్రాక్ షురూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 అయితే వీరిద్దరూ ఐ బ్లింక్ చాలెంజ్ లో భాగంగా అలా ఒకరి కళ్లలోకి  మరొకరు చూసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరి రొమాంటిక్ చూపులకు చాలామందిని నెటిజన్స్ ఫిదా అవ్వడమే కాకుండా ఇక రీతూ చౌదరి పవన్ కళ్యాణ్ పడాల మధ్య లవ్ పుడుతోంది.. ఇక ఈ సీజన్లో వీరిదే మొదటి లవ్ ట్రాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి వీరిద్దరి లవ్ ట్రాక్ చివరి వరకు కొనసాగుతుందా.. లేక ఐ బ్లింక్ ఛాలెంజ్ వరకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: