
ఈ విషయంపై నిన్నటి రోజున సభలో ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. బాలకృష్ణ అనారోగ్యానికి గురవడం వల్ల ఈ సభకు హాజరు కాలేకపోయారనే విషయం తెలపడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను కూడా తెలియజేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి బాలయ్య నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఏది ఏమైనా.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభకు బాలయ్య రావాల్సి ఉండగా అనారోగ్యంతో బాధపడుతూ రాలేదని విషయం చెప్పినప్పటి నుంచి అభిమానుల్లో ఆందోళన మొదలైంది అని చెప్పవచ్చు.
ఒకవైపు సినిమాలలో మరొకవైపు ఎమ్మెల్యేగా తన విధులను నిర్వహిస్తున్న బాలయ్య.. టిడిపి పార్టీ నుంచి హిందూపురంలో మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. సినిమాలలో కూడా వరుస విజయాలు అందుకుంటున్న బాలయ్య.. ఇప్పటికే వరుసగా 4 సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు బాలయ్య.ఈ సినిమా ప్రేక్షక ముందుకి ఎప్పుడో రావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమయ్యిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కానీ ఇంకా రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు.