ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయ్యాక బాలీవుడ్ లో హీరోయిన్ గా చాలా సంవత్సరాలు రాణించింది.ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ జనాలను పలకరిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడింది.ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే సల్మాన్ ఖాన్ వల్ల ఐశ్వర్య రాయ్ సినీ కెరియర్ అమాంతం పెరిగిపోయింది.దానికి కారణం సల్మాన్ ఖాన్ అప్పటికే స్టార్ హీరో కాబట్టి ఐశ్వరరాయ్ కి వరస అవకాశాలు వచ్చేవి. అలా ఐశ్వర్యరాయ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది  అంటే దానికి కారణం సల్మాన్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. అయితే సల్మాన్ ఖాన్ వల్ల ఐశ్వర్య రాయ్ సినీ కెరియర్ బాగుంది. కానీ పర్సనల్ కెరియర్ మాత్రం బాగోలేదు. 

ఎందుకంటే ఐశ్వర్య కు సల్మాన్ ఇమేజ్ కారణంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్ల ఐశ్వర్య రాయ్ చాలా టార్చర్ అనుభవించింది.చాలా సమయాల్లో ఐశ్వర్య రాయ్ ని సల్మాన్ ఖాన్ చిత్రహింసలు పెట్టేవారు అనే విషయాన్ని ఆ మధ్యకాలంలో చెప్పుకొచ్చింది.అలాగే సల్మాన్ ఖాన్ అతి ప్రేమని తట్టుకోలేకే చివరికి ఐశ్వర్యరాయ్ అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే బ్రేకప్ చెప్పాక కూడా చాలా రోజులు ఐశ్వర్యరాయ్ ని వదిలిపెట్టలేదట సల్మాన్. అయితే ఓ సందర్భంలో తన ఇంటి ముందుకు వచ్చి తల బద్దలు కొట్టుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఐశ్వర్య రాయ్ సల్మాన్ ల గురించి మాట్లాడుతూ.. సల్మాన్ ఐశ్వర్యల బ్రేకప్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కి అవకాశాలు రాలేదు.

ఇండస్ట్రీ మొత్తం ఐశ్వర్యని పక్కన పెట్టింది.ఆ సమయంలో ఐశ్వర్య డిప్రెషన్ లోకి వెళ్లింది. కానీ నేను ఆమె దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాను. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోయినప్పటికీ ఆమె పర్సనల్ కెరియర్ లో మాత్రం ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే సల్మాన్ తో ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి టార్చర్ అనుభవించింది. ఇక ఒకరోజు సల్మాన్ ఆమె ఇంటి ముందుకు వచ్చి పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించి తల గోడకేసి బాధకున్నాడు. అయితే ఈ విషయం నాకెలా తెలిసిందని మీకు డౌట్ రావచ్చు  ఎందుకంటే నేను కూడా ఐశ్వర్య ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడిని. అలా సల్మాన్ చేసిన బాగోతాలాన్ని నేను చూశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ ఫిలిం డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: