ఏంటి ఆ పెళ్లి కారణంగా రాశి జీవితం తలకిందులైందా..పేరెంట్స్ ని ఎదిరించి మరీ రాశి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ నటి రాశి ఒకప్పుడు తన అందచందాలతో సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తన భారీ అందాలకు మంత్రముగ్ధులైన చాలామంది అప్పట్లో రాశిని తమ ఫేవరెట్ హీరోయిన్ గా చెప్పుకునేవారు. అయితే అలాంటి రాశి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రం రాశికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి అంటుంటారు. ఆ ముగ్గురు కూడా డైరెక్టర్లే అని అంటుంటారు.ఒకటి తెలిసి తెలియని వయసులో చేస్తే మరొకటి తెలిసిన ఏజ్ లోనే తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది అంటుంటారు. ఇక ఈ రెండు పెళ్లిళ్లు కూడా చాలా రోజులు కొనసాగలేదు. అయితే మూడో పెళ్లి విషయంలో కూడా రాశి తన పేరెంట్స్, 

ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్కచేయలేదట.ముఖ్యంగా తన పెళ్లి కారణంగా ఎన్నో గొడవలు అయ్యాయి అంటూ తాజా ఇంటర్వ్యూలో రాశి చెప్పుకొచ్చింది.. రాశి మాట్లాడుతూ.. నేను శ్రీముని ని పెళ్లి చేసుకున్న సమయంలో మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నాను అనే విషయం మా అన్నయ్యకు తెలిసి ఏంటి పెళ్లి చేసుకుంటానని అంటున్నావట బయట అని అడిగితే.. పెళ్లి చేసుకుంటా అని అనడం లేదు పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నాను అని ఆన్సర్ ఇవ్వడంతో అన్నయ్యకు కోపం నషాలానికి ఎక్కింది. దాంతో మా ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. అయితే శ్రీముని కంటే ముందు నేనే ఆయన్ని పెళ్లి చేసుకుందాం అని అడిగాను.ఒకర్ని ఇష్టపడ్డామంటే దానికి ఒక బలమైన కారణం అనేది ఉంటుంది. అలాగే నా లైఫ్ లో కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది.

నేను ఓ సినిమా లోని సీన్ చేస్తున్న టైంలో నన్ను దూరం నుండి చూస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ముని కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇక ఈ సీన్ అయిపోవడంతోనే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసాను అంటూ చెప్పుకొచ్చింది రాశి. అయితే రాశి అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న సమయంలో చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. ఇదేంటి స్టార్ హీరోయిన్ అయి ఉండి ముక్కు మొహం తెలియని ఇండస్ట్రీలో అసలు పేరే లేని వారిని పెళ్లి చేసుకుంది. ఎవరైనా ఆస్తిపాస్తులు ఉన్న వారిని,లేక బిజినెస్ మాన్ లని,స్టార్ సెలబ్రెటీలని పెళ్లి చేసుకోవాలి. కానీ రాశి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆశ్చర్యపోయారు. ఇక రాశి శ్రీముని లకు ఒక కూతురు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: