టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తేజ ఆఖరుగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మిరాయ్ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రేపు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ స్టార్ట్ అవడం తోనే ఈ మూవీ కి ఫ్రీ సేల్స్ ద్వారానే అద్భుతమైన రేంజ్ లో కలక్షన్లు దక్కుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ సేల్స్ ద్వారానే ఐదు కోట్ల కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది.

ప్రీ సేల్స్ ద్వారానే ఈ సినిమా ఐదు కోట్ల కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది అంటేనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక వేళ ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని , లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ భారీ వసూళ్లను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: