సినిమా ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడు ఎవరికీ ఒకేలా ఉండదు అని చెప్పే మాట వందసార్లు విన్నా, ఆ పరిస్థితిని  ఫేస్ చేసినప్పుడే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతం అలాంటి కఠిన పరిస్థితిని ఎదుర్కొంటూ ట్రోలింగ్ తుఫాన్‌లో మునిగిపోతున్న హీరోయిన్ శ్రీలీల. కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా టాప్ హీరోయిన్స్‌లో స్థానం సంపాదించుకుంది. కానీ ఇటీవల కాలంలో ఆమె కెరీర్ గణనీయంగా కుదేలవుతూ, సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటోంది. శ్రీలీల ఏ నిర్ణయం తీసుకున్నా అది సోషల్ మీడియాలో తప్పుగా ప్రెజెంట్ అవుతోంది. ఆమె ఎంచుకున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో, ఆ హిట్ ఫార్ములా మిస్ అయ్యిందని అనిపిస్తోంది. అంతేకాకుండా, ఆమె చేసిన కామెంట్స్ కూడా పలు కాంట్రవర్సీలకు దారితీస్తూ, మరింత ట్రోలింగ్‌కి కారణమవుతున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్‌కి హాట్ ఫేవరేట్‌గా నిలిచిన ఈ హీరోయిన్, ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్స్‌కు ఇష్టమైన టార్గెట్‌గా మారిపోయింది.


ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నూతన తారలు ఒక్కొక్కరిగా హిట్ కొడుతూ ఇండస్ట్రీలో తమ స్థానం బలపరుస్తున్నారు. ఇటీవల మమితా బైజు, రుక్మిణి వసంత్ వంటి నటి ల పేర్లు తెలుగు ప్రేక్షకుల మధ్య వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా అడుగుపెట్టింది రితికా నాయక్. ‘మిరాయి’ సినిమాలో హీరో తేజ సజ్జతో కలిసి నటించిన రితికా నాయక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా విజయం మాత్రమే కాదు, ఆమె అందం, కట్టుదిట్టమైన స్క్రీన్ ప్రెజెన్స్, మాట తీరు— అన్ని ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె కెరీర్ గ్రాఫ్ వేగంగా పైకి ఎగబాకుతోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రేక్షకులు, సినీ విమర్శకులు కూడా రితికా నటనను ప్రశంసిస్తున్నారు. ఒక హిట్ సినిమా తర్వాత రితికా మరో బిగ్ ప్రాజెక్ట్‌లో మంచి పాత్ర దక్కించుకుంటే, తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న శ్రీలీల స్థానాన్నే సవాలు చేసే అవకాశముందని చాలామంది అంటున్నారు.



ఇక శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఈ పరిస్థితిని గమనిస్తూ, "మా ఫేవరెట్ హీరోయిన్‌పై శని తాండవం జరుగుతున్నట్టుంది. అందుకే ఇంతమంది బ్యూటీస్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు శ్రీలీలకు కాంపిటీషన్‌గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తం మీద, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒక వైపు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలీల, మరో వైపు కొత్త తారలు సెన్సేషన్ సృష్టిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఈ కాంపిటీషన్ రేస్‌లో ఎవరు సింహాసనం దక్కించుకుంటారో చూడాలి...???

మరింత సమాచారం తెలుసుకోండి: