- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కె.భాగ్యరాజా కథతో చిరంజీవి నటించిన సినిమా ఒక‌టి ఉంది.. ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు తెలియ‌దు కాని... తెలుగులో పాపులర్ కమెడియన్ అయిన సుధాకర్ హీరోగా నటించిన ఓ తమిళ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి హీరోగా చేశారు. పైగా ఆ సినిమా చిరంజీవి - చంద్రమోహన్ హీరోలుగా నటించిన తొలి సినిమా కూడా కావ‌డం విశేషం. రాధిక తొలిసారి కమిట్ అయిన తెలుగు సినిమా కూడా అదే కావ‌డం విశేషం. ఈ నాలుగు ప్రశ్నలకి ఒకటే సమాధానం ‘ ప్రియ ‘. సుమంత్ ఆర్ట్స్ అధినేత, ప్రముఖ దర్శక,నిర్మాత ఎమ్. ఎస్. రాజు తండ్రి రాయపరాజు దీనికి నిర్మాత గా వ్య‌వ‌హ‌రించారు. దీనికి దర్శకుడేమో ఎస్. పి. చిట్టి బాబు. ఈయన సోదరుడే నిర్మాత ఎస్. పి. వెంకన్నబాబు. వెంక‌న్న బాబు ఆ త‌రంలో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు నిర్మించారు.


కృష్ణంరాజు – చిరంజీవి కాంబినేషన్ లో ‘ ప్రేమ తరంగాలు ‘ తీసిన రాయపరాజు- ఎస్. పి. చిట్టి బాబు, ఆ సినిమా రిలీజ్ కాకముందే ‘ ప్రియ ‘ మొదలుపెట్టారు. భాగ్యరాజా కథతో భారతీరాజా తమిళంలో ‘నిరం మారాద పూక్కల్‘ (1979) అనే సినిమా తీశారు. సుధాకర్, రాధిక , విజయన్, రతీ అగ్నిహోత్రి  ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా రీమేకే ‘ప్రియ‘. 1981 అక్టోబర్ 23 న రిలీజైన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. దీనికి మాటలు రాసింది ఆత్రేయ. తమిళ మాతృకకు ఇళయరాజా సంగీత దర్శకుడైతే , తెలుగులో చక్రవర్తి స్వరాలందించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: