బిగ్ బాస్ సీజన్ 9లోకి తొమ్మిది మంది సెలబ్రెటీసు 6 మంది సామాన్యులు హౌస్ లోకి వెళ్లగా.. మొదటివారం ఇటీవలే ముగిసింది. హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచే అటు సామాన్యులు, సెలబ్రిటీల మధ్య ఒక మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. మొదటివారం నామినేషన్ లో శ్రేష్ట వర్మ, రీతూ చౌదరి, తనూజ ,సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్, డిమాన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. మొదటి ఎలిమినేషన్ గా లేడీ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన శ్రేష్ఠ వర్మ హౌస్ లో నుంచి బయటికి వచ్చేసింది.



బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత తన ఆట తీరుతో శ్రేష్ఠ వర్మ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఓటింగ్ లో కూడా ఈమెకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో మొదటి వారమే హౌస్ నుంచి బయటికి వచ్చింది. దీంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన శ్రేష్ట వర్మ బిగ్ బాస్ హౌస్ లో వారానికి రూ .2 లక్షల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ పైన కూడా ఒక బిగ్ బాబు పేల్చింది.


హౌస్ లో నిజాయితీగా ఉండేది ఎవరు అని అడగగా? అందుకు మనీష్, రాము రాథోడ్, ఆశ, హరీష్ అని పేర్లు మాత్రమే తెలిపింది. కెమెరా ముందు మాత్రమే యాక్టింగ్ చేస్తోంది ఎవరు అని ప్రశ్నించగా?.. రీతూ చౌదరి, తనూజ, భరణి అంటే తెలియజేసింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా పేరు సంపాదిస్తుందని అభిమానులు భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా ఇమే హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడం తో పాటు నామినేషన్ లో ఈమె  పేరు ఉన్నప్పటికీ ఈమెకు ఓటింగ్ కూడా పెద్దగా పడలేదు.అందుకే ఎలిమినేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: