ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అయ్యింది అంటే ఆ సినిమాపై మొదట అంచనాలను పెంచడానికి ఫస్ట్ లుక్ , గ్లిమ్స్ అంటూ కొన్నిటిని విడుదల చేస్తూ ఉంటారు. అవి బాగా క్లిక్ అయినట్లయితే ఆ సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుంది. ఇక మంచి బజ్ ఏర్పడిన తర్వాత సినిమా విడుదల తేదీ దగ్గర పడింది అంటే చాలు మేకర్స్ ఆ సినిమా యొక్క కథ మరియు కాస్త లైన్ తెలిసే విధంగా టీజర్ , ట్రైలర్లను విడుదల చేస్తూ ఉంటారు. అవి కూడా అద్భుతంగా ఉన్నట్లయితే సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నుండి చాలా కాలం క్రితం ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో సినిమాపై అంచనాలు తారా స్థాయికి పెరిగిపోయాయి. ఇక కొంత కాలం క్రితం ఈ మూవీ నుండి రెండు పాటలను , పవన్ బర్త్ డే సందర్భంగా ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అసలు సిసలైన కంటెంట్ మాత్రం బయటకు రాలేదు.

ఓజి మూవీ నుండి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అవి సినిమా స్టోరీని గాని , సినిమా ఎలా సాగుతుంది అనే దాన్నే మాత్రం తెలియజేయడం లేదు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్ కానీ విడుదల అవుతూనే ఆ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తేదీ అత్యంత దగ్గరగా వచ్చింది. దానితో ఈ సినిమా నుండి టీజర్ , ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతాయా ..? ఈ మూవీ కంటెంట్ ఏమిటి అనేది ఎప్పుడు తెలుస్తుందా అని అనేక మంది జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk