పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , పవన్ కళ్యాణ్ కి జోడిగా కనిపించనుండగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... అర్జున్ దాస్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దానితో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు ఎప్పుడు మొదలవుతాయా అని పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఓజి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఓజి మూవీ కి సంబంధించిన నైజాం ఏరియా టికెట్ బుకింగ్స్ సెప్టెంబర్ 20 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారు. దానితో అందుకు సంబంధించిన జీవోలు విడుదల కావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. దానితో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆ మూవీల విడుదలకు ఒకటి లేదా రెండు రోజుల ముందే ఓపెన్ అవుతున్నాయి. ఇక పవన్ నటించిన ఓజి సినిమా టికెట్ బుకింగ్స్ నైజాం ఏరియాలో అందుకు భిన్నంగా చాలా రోజుల ముందే ఓపెన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఓజి మూవీ టికెట్ బుకింగ్స్ ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే నైజాం ఏరియాలో ఓపెన్ కానున్నట్లు వార్తలు వస్తుండడంతో నైజాం ఏరియా కు సంబంధించిన పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk