కల్కి 2898AD సీక్వెల్ నుండి దీపిక పదుకొనేని తీసేస్తే ఓ డైరెక్టర్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.ఇక డైరెక్టర్ అనే పేరు చెప్పగానే మీ అందరికీ సందీప్ రెడ్డి వంగానే గుర్తుకొస్తారు.అవును ఆయనే తెగ సంబరపడిపోతున్నారు. ఆయనలో ఉన్న సంతోషాన్ని ఎమోజీల రూపంతో బయటపెట్టేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి  పెట్టిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో దీపికా పదుకొనే అభిమానులకు తెగ చిరాకు పుట్టిస్తోంది.ఒక్క పోస్ట్ తో సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో మంట పెట్టేశారు. మరి ఇంతకీ సందీప్ రెడ్డి వంగా పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కల్కి పార్ట్ 2 నుండి దీపిక పదుకొనేని తీసేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు. అయితే దానికి కారణం ఏంటో కూడా ఆ పోస్టులో మెన్షన్ చేశారు. మా సినిమా కోసం నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుంది. 

అలాగే చెప్పిన సమయానికి షూట్ అంటే కుదరదు. అలాగే టైం టూ టైం షూటింగ్ ఉండాలి అన్న కుదరదు అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టి మీరు భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులకు శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. అయితే దీపికా పదుకొనే కల్కి పార్ట్ 2 కోసం సమయం కేటాయించిందట. కానీ వాళ్ళు చెప్పిన సమయానికి కాకుండా తాను ఇచ్చే సమయంలోనే తన మీద షూట్ చేయాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ కల్కి పార్ట్ 1 షూటింగ్ కోసం అన్ని సంవత్సరాలు తీసుకున్న నాగ్ అశ్విన్ పార్ట్ 2 కోసం మరిన్ని సంవత్సరాలు తీసుకుంటారని అర్థం చేసుకోవచ్చు. అలాంటిది హీరోయిన్ చెప్పిందని ఆమె చెప్పిన సమయంలో షూట్ చేయడం డైరెక్టర్ కి నచ్చలేదు. అందుకే ఈ చిత్రం నుండి దీపికని తొలగించినట్టు అర్థమవుతుంది. స్పిరిట్ మూవీ సమయంలో కూడా సందీప్ రెడ్డి వంగాకి దీపిక ఇలాంటి కండిషన్ పెట్టిందట..

షూటింగ్ కి ఎక్కువ రోజులు ఇవ్వలేనని అలాగే డేట్స్ కేటాయించాక కూడా ఒక ప్రత్యేక సమయంలోనే నేను షూట్ కి వస్తాను అని కండిషన్లు పెట్టడంతో ఇవేవీ నచ్చక డైరెక్టర్ తీసేశారు.ఇప్పుడు కల్కి-2 నుండి కూడా తీసేయడంతో సందీప్ రెడ్డి వంగా బాధ ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఎందుకంటే స్పిరిట్ మూవీ కి దీపికను తీసేసి త్రిప్తిని పెట్టుకున్న సమయంలో సందీప్ పై వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు కల్కి -2 విషయంలో కూడా దీపికను తీసేసేసరికి ఆయన బాధ ఏంటో అందరికీ అర్థమైంది. అయితే వైజయంతి మూవీస్ బ్యానర్ పెట్టిన పోస్ట్ కి సందీప్ రెడ్డి వంగా నవ్వుతూ ఉన్న ఎమోజిస్ ని షేర్ చేయడంతో చాలామంది దీపిక ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి సందీప్ రెడ్డి వంగా పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.కానీ కల్కి పార్ట్ -2నుండి తీసేస్తే సందీప్ రెడ్డి వంగా కి ఎంత ఆనందంగా ఉందో ఆయన షేర్ చేసిన ఒక్క పోస్టు ద్వారా అర్థం అవుతుంది అంటున్నారు చాలామంది నెటిజెన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: