నందమూరి బాలకృష్ణ అఖండ-2 అనే మూవీతో మన ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఇది సర్టిఫైడ్ పాన్ ఇండియా మూవీ అని.. రచ్చ గెలిచి ఇంట గెలుస్తాను అంటూ పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టారు. అలా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నామని, కచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని, సనాతన ధర్మం మీద సమాజ విలువల మీద ఈ సినిమా తీశామని, యూత్ ఈ సినిమా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..హైందవ విలువలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి అంటూ బాలకృష్ణఈవెంట్ లో మాట్లాడారు. అయితే బాలకృష్ణ మాట్లాడిన మాటలు పక్కన పెడితే..బాలకృష్ణకు బీజేపీ నుండి సపోర్ట్ దొరుకుతుందా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కూటమిలో బీజేపీ కూడా భాగమే కాబట్టి కచ్చితంగా బాలకృష్ణ సినిమా కి సపోర్ట్ చేస్తారు అని తెలుస్తోంది. 

కానీ కొంతమంది మాత్రం మోడీ చంద్రబాబు పేరునే ఎక్కువగా జపించరు అలాంటిది బాలకృష్ణ సినిమాకు సపోర్ట్ చేస్తారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే మరికొంత మందేమో నార్త్ లో హిందూ ధర్మంపై వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. కచ్చితంగా బాలకృష్ణ అఖండ-2 సినిమాని నార్త్ వాళ్ళు ఆదరిస్తారు అని మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం గతంలో వచ్చిన కార్తికేయ-2, హనుమాన్ సినిమాలే.ఈ సినిమాలలో రాముడు, కృష్ణుడు,హనుమాన్ వంటి దేవుళ్ళని మెయిన్ గా తీసుకొని సినిమాలు తెరకెక్కించారు. ఇక ఉత్తరాది వాళ్లకు ఇలాంటి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. దాంతో కార్తికేయ-2, హనుమాన్ సినిమాలను తెగ మెచ్చుకున్నారు.అయితే అఖండ-2 కూడా అదే లెవెల్ లో ఉంటుంది అని బాలకృష్ణ చెప్పుకొస్తున్నారు. మరి కార్తికేయ-2, హనుమాన్ సినిమాలకు దక్కిన గుర్తింపు, గౌరవం నార్త్ లో అఖండ-2 కి దక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది.

 అయితే దేవుళ్ళ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ బాలకృష్ణ సినిమాలు అంటేనే ఆయనకు సంబంధించిన భారీ డైలాగులు ఉంటాయి. ఇక ఇలాంటి డైలాగులు నార్త్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. ఇక ఇందులో సనాతన ధర్మం గురించి ఉందని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నార్త్ లో ఉన్న బిజెపి నాయకులు ఈ సినిమాని సపోర్ట్ చేస్తారు అని తెలుస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు తన పిఆర్ స్టంట్ తో బాలకృష్ణకు సహాయం చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ ముందున్న పెద్ద టార్గెట్ బీజేపీ మెప్పు పొందడమే . బీజేపీ మెప్పు పొందితే ఖచ్చితంగా అఖండ-2 నార్త్ లో భారీ విజయం సాధిస్తుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: