ఇప్పుడేమో ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమే ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు, ఫిల్మ్‌మేకర్ ఎస్.ఎస్. కార్తికేయ పుట్టినరోజు సంధర్భంగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా పాల్గొని, ఆయనతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్వయంగా ప్రియాంకా చోప్రా తన సోషల్ హ్యాండిల్స్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ,"నా ప్గ్రెండ్ తో డ్యాన్స్ అధుభుతంగా వచ్చింది" అంటూ రాసుకొచ్చింది.'వారణాసి' సినిమాలో ప్రియాంకా చోప్రా ‘మందాకినీ’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత శక్తివంతమైన మహిళా పాత్ర అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కథను ముందుకు నడిపే ప్రధాన బలంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇక మహేష్ బాబు నటనతో పాటు, ప్రియాంకా–మహేష్ కాంబినేషన్, రాజమౌళి విజువల్ మ్యాజిక్—ఈ మూడు కలిస్తే ప్రపంచ బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి స్వరాలను అందిస్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ అవార్డు విజేతగా మారిన తర్వాత ఇది మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో, సౌండ్ ట్రాక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ క్లిప్స్ పరిశ్రమలో వైరల్ అయ్యాయి.. అవి సినిమా స్థాయిని మరింతగా సూచిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇక కార్తికేయ–ప్రియాంకా డ్యాన్స్ వీడియోతో సినిమా బజ్ మరింత రెట్టింపైంది. అభిమానులు ఈ ఇద్దరి ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే—“సెట్‌ల్లో కూడా ఇదే లెవెల్ ఎనర్జీ ఉంటే చిత్రం బ్లాక్‌బస్టర్ కన్‌ఫర్మ్” అంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. మొత్తంగా, ఒక్క చిన్న వీడియోతోనే ‘వారణాసి’ సినిమా హైప్ మళ్లీ పీక్‌కి ఎక్కింది. ముందున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో అని సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి