తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన మిరాయ్ మూవీ తొలిరోజే యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇతర భాషల్లో ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో సాంగ్స్ లేకపోవడం సినిమాకు ఊహించని స్థాయిలో మైనస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా నిడివి రెండు గంటల 50 నిమిషాలు ఉంది. మరో 10 నిమిషాల నిడివి యాడ్ అయ్యి ఉంటే సినిమాకు ప్లస్ జరిగేది.

మిరాయ్ మూవీ మేకర్స్ మరిన్ని  జాగ్రత్తలు  తీసుకుని ఉంటే  మాత్రం ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించేది. శ్రీరామునికి సంబంధించిన షాట్స్ ఎక్కువగా ఉండే విధంగా సినిమాలో ప్లాన్ చేసుకుని ఉంటే  బాగుండేది. మంచు మనోజ్ కు మాత్రం ఈ సినిమా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇకపై మరిన్ని సినిమాల్లో మనోజ్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

మిరాయ్ సినిమా ఎంతోమంది కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పవచ్చు. విడుదలకు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించి ఉంటే  ఈ సినిమాకు మరింత బెనిఫిట్ కలిగేది. ఒకే ఒక్క థియేటర్ లో మాత్రం ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శితమైంది. మిరాయ్  మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని భావించగా సెకండ్ వీకండ్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే  మాత్రం మిరాయ్  మూవీ ఇప్పటికే హిట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మిరాయ్  మూవీకి సంబంధించి పబ్లిసిటీలో మరింత వేగం పెంచాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. మిరాయ్ సినిమా సీక్వెల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. మిరాయ్  సీక్వెల్ లో రానా కనిపించనున్నారని  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: