
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ హైప్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ పవర్, ఆయన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను డైరెక్టర్ సుజీత్ సరిగ్గా చూపించాడు. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ సర్కిల్స్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. అంతేకాదు, రిలీజ్‌కి ముందే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడంతో రికార్డులు తిరగరాసే స్థితికి చేరింది.
తాజాగా అప్‌డేట్ ప్రకారం, యూఎస్, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల మార్క్ దగ్గరికి చేరుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది ప్రీ-రిలీజ్ దశలోనే ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్ అయితే ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉండడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే టీజర్లు, ట్రైలర్స్‌లో హైలైట్ అయింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం ఉన్న చిత్రంగా “ఓజి”పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు