
టాలీవుడ్ అభిమానులందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం “దే కాల్ హిమ్ ఓజీ” రిలీజ్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవన్ మాస్ రాంపేజ్‌ను చూడటానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ ముందు ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రకటన ప్రకారం, తమిళ వెర్షన్ నార్త్ అమెరికాలో విడుదల కావడం లేదు. కంటెంట్ డెలివరీలో ఆలస్యమవ్వడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. దీంతో ఓజీ సినిమా కోసం ఆతృతతో వెయిట్ చేస్తోన్న తమిళ ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. తెలుగు వెర్షన్ మాత్రం ప్లాన్ చేసినట్టుగానే ప్రదర్శించబడుతుంది అని డిస్ట్రిబ్యూటర్ స్పష్టతనిచ్చాడు.
తెలుగు వెర్షన్‌కీ మొత్తం కంటెంట్ ఇంకా పూర్తిగా అందలేదు. అయినా సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటల నుంచి అమెరికాలోని కొన్ని సెలెక్ట్ లొకేషన్స్‌లో ప్రీమియర్లు ప్రారంభమవుతాయని ప్రకటించారు. దీంతో యూఎస్‌లోని తెలుగు ప్రేక్షకులు పవన్ పవర్‌ను తొలుత చూసే అదృష్టం పొందబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అదనంగా ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, శామ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ట్రైలర్లు, టీజర్లలోనే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మొత్తానికి, ఓజీపై ఉన్న అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తమిళ వెర్షన్ నార్త్ అమెరికాలో వాయిదా పడినప్పటికీ, తెలుగు వెర్షన్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన సినిమా అనుభవం రాబోతోందని చెప్పొచ్చు.