పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలిసి తెరకెక్కిస్తున్న తాజా భారీ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం యూరప్ షెడ్యూల్ కోసం బయల్దేరింది. అక్కడ ప్రభాస్, హీరోయిన్ల‌పై రెండు పాటలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో, హైదరాబాదులో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


మారుతి శైలికి తగ్గట్టుగా ఎంటర్టైనింగ్, మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపి సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు ఈ సినిమా పూర్తిగా కొత్త జానర్‌గా ఉండబోతోందని టాక్. ఇప్పటివరకు ఆయన చేసిన యాక్షన్, ఫ్యాంటసీ లేదా సై-ఫై జోనర్‌లకు భిన్నంగా, ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉంటుందట. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ పోస్టర్స్, లీక్ అయిన షూట్ స్నిపెట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.


తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా, మొత్తం ఇండస్ట్రీ ఈ కాంబినేషన్‌పై దృష్టి సారించింది. మారుతి ఈ సినిమాతో తన దిశను, రేంజ్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, ప్రభాస్ - మారుతి కాంబో నుండి భారీ బ్లాక్‌బస్టర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: