టాలీవుడ్ నటి మనులలో ఒకరైన మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . టాలీవుడ్ లో అడపా దడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇటీవల దక్ష అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ అందుకుంది ఈ బ్యూటీ . ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు వెకేషన్స్ కు వెళ్తుంది . ఇక అక్కడ తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది .


ఇదే క్రమంలో తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ఫరియా అబ్దుల్లా తో కలిసి మంచు లక్ష్మి ఇంగ్లాండ్ కు వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ .. " జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం కోసం ఎప్పటికీ నా బడ్జెట్ లిస్టులో ఉంది . ఇంత తక్కువ సమయంలో ఎంత అందంగా ఉన్నా ప్రదేశాన్ని చూడడం మాయాజాలంగా అనిపిస్తుంది. ప్రతి జలపాతం ప్రతి ఇంద్రధనస్సు మరియు ప్రతి నవ్వు నేను మీ అందరికీ రుణపడి ఉంటాను . మీతో నా తదుపరి యాత్రను ఇప్పటికే ప్లాన్ చేస్తున్నాను .


నవదీప్ ఇది మా మొదటి ప్రయాణమని నమ్మలేకపోతున్నా రా? మేము ఉత్తమమైన వాటి కోసం ఉత్తమమైన వాటిని సేవ చేసుకుందామని అనుకుంటున్నాను . ఇంత అద్భుతమైన వ్యక్తి ఈ సాహసానికి నాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్ . ఇక్కడ ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి . ఫరియా మీరిద్దరూ లేకుంటే నేను ఏమి చేసేదానినో నాకు నిజంగా తెలియదు . నవ్వు మరియు వెర్రితనం మీ అందమైన పిల్లతనం స్ఫూర్తికి ధన్యవాదాలు " అంటూ వెల్లడించింది మంచు లక్ష్మి . ప్రజెంట్ మంచు లక్ష్మీ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: