కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈయన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు.

రుక్మిణి వసంత్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా పెద్ద ఎత్తున విఫలం అయింది. ఇకపోతే శివ కార్తికేయన్ ప్రస్తుతం పరశక్తి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి కాంబోలో కాలేజ్ డాన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తోనే సిబి చక్రవర్తి దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు.

ఇక తన రెండవ సినిమాను కూడా ఈ దర్శకుడు శివ కార్తికేయన్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి కాంబోలో రూపొందబోయే సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శ్రీ లీల ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk