తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. వెంకటేష్ కెరియర్ లో కల్ట్ క్లాసిక్ గా మిగిలి పోయిన సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ప్రకాష్ రాజ్మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి కథ , స్క్రీన్ ప్లే , డైలాగ్లను అందించాడు.

మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమాను మరికొంత కాలం లోనే రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. రీ రిలీజ్ లో భాగంగా కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టాయి.

మరి వెంకటేష్ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ అయినటువంటి నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లోని వెంకటేష్ ,  ఆర్తి అగర్వాల్ నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ ద్వారా దర్శకుడిగా విజయ భాస్కర్ కి కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా , డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: