టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే హరిహర విరమాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా పవన్ "ఓజి" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో అత్యంత బిజీ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. దానితో పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ పూర్తి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా తర్వాత కూడా మూవీలు చేసే ఆలోచనలు ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఓ దర్శకుడి మూవీ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటికే సురేందర్ రెడ్డి , పవన్ కళ్యాణ్ కి ఓ స్టోరీ ని వినిపించగా ఆ స్టోరీ బాగా నచ్చడంతో పవన్ వెంటనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓవర్త వైరల్ అవుతుంది. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు గ్యాంగ్ స్టార్ కథను చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ జోనర్లో రూపొందిన ఓజి మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: