టాలెంట్ ఉంటే ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారైనా సరే ప్రేక్షకులు తప్పక గౌరవిస్తారు, వారిని భుజాల మీద ఎక్కించుకుంటారు అని మరోసారి రుజువైంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సోషల్ మీడియా నుండి సినీ వర్గాల వరకు ఈ సినిమా గురించి ఒక్కటే మాట – “మైండ్ బ్లోయింగ్”!సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు పెద్దగా హైప్ చూపలేదు. “ఇది కాంతార లెవెల్‌కి రాదు”, “కాన్సెప్ట్ క్లియర్‌గా లేదు” అంటూ నెగిటివ్ కామెంట్లు, ట్రోలింగ్స్ వెల్లువెత్తాయి. అంతేకాదు, ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవ్వడంతో “సినిమా ఫెయిల్ అయ్యిందేమో” అంటూ రూమర్లు కూడా రచ్చ చేశాయి. కానీ సినిమా మొదటి షో పడగానే ఆ టాక్ మొత్తం తలకిందులైపోయింది.


రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, ఆయన  డైరెక్షన్, అలాగే రుక్మిణి వసంత్ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ – ఈ మూడూ కలిసి సినిమాకు మేజర్ ప్లస్ అయ్యాయి. కథనంలోని లోతైన ఆధ్యాత్మికత, గ్రామీణ భావాలు, సంగీతం – అన్నీ ప్రేక్షకుల హృదయాలను తాకాయి.రిలీజ్ అయిన మొదటి షో నుంచే “కాంతార చాప్టర్ 1” బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం కన్నడ ప్రేక్షకులే కాదు, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ రాష్ట్రాల్లో కూడా సినిమా హడావుడిగా ట్రెండ్ అవుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం అంతలా ప్రభావం చూపడంతో దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది.



మొదటి వారంలోనే సినిమా ఏకంగా ₹509.25 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ ఫిగర్‌ను అధికారికంగా మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం మరింత పెరిగింది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతుండగా, వీకెండ్ కలెక్షన్లు ఇంకా ఎగబాకే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇంత భారీ ఓపెనింగ్‌తో “కాంతార చాప్టర్ 1” గతంలో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నెలకొల్పిన రికార్డులను తుక్కుతుక్కు చేసి పడేసింది. ఇది కేవలం సినిమా కాదు – ఒక సెలబ్రేషన్, ఒక సాంస్కృతిక సంచలనం. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ, తెలుగులో కూడా మంచి ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఆయన తర్వాతి ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే భారీ చర్చ జరుగుతోంది.“కాంతార చాప్టర్ 1”తో రిషబ్ శెట్టి మరోసారి తానేంటో ప్రూవ్ చేశాడు. కళాకారుడికి లాంగ్వేజ్ బౌండరీలు ఉండవు, టాలెంట్ ఉంటే దేశం మొత్తం చప్పట్లు కొడుతుంది.. అంటూ జనాలు పొగిడేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: