
తరువాత తన వ్యక్తిగత జీవితంలో అడుగు వేసి, వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతుందని అందరూ భావించారు. కానీ, అనుకున్నట్లుగా జరగలేదు. భర్తతో వివాదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సిరీస్‌తో నిర్మాతగా సక్సెస్ అందుకుంది. ఆ వెబ్ సిరీస్ తెచ్చిన ప్రశంసలతో నిహారిక మళ్లీ తన కెరీర్‌ను కొత్త దిశలోకి మలచుకుంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక వీడియో . ఇది నిహారికకి సంబంధించిన పాత క్లిప్. ఇందులో ఆమెతో పాటు యంగ్ హీరో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఓ గోడ పక్కన ఇద్దరూ నిలబడి సిగ్గు పడిపోతూ మాట్లాడుకుంటూ ఉన్న సన్నివేశం ఆ వీడియోలో కనిపిస్తోంది. నిహారిక సరదాగా గిలిగింతలు పెడుతుండగా, విశ్వక్ సేన్ కొంచెం సిగ్గుపడుతూ కనిపిస్తాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు — “వీరిద్దరూ కలిసి ఎప్పుడూ సినిమా చేయలేదు.. మరి ఈ వీడియో ఎప్పుడు తీసారు?”, “ఇది ఏదైనా పూర్తి కాలేని సినిమా సీన్ అయి ఉండొచ్చా?”, “లేదా వీళ్ళు కాలేజీ టైంలో తీసుకున్న షార్ట్ ఫిల్మ్ ఏమైనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది అభిమానులు మాత్రం, “నిహారిక, విశ్వక్ సేన్ కెమిస్ట్రీ స్క్రీన్‌పై అద్భుతంగా ఉంది”, “ఇద్దరి ఫ్రెష్ ఎక్సప్రెషన్స్ చాలా బాగున్నాయి” అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది ట్రోల్స్ చేస్తూ నిహారికను విమర్శిస్తూ, “ఇలాంటివి చూసే నీ మొగుడు వదిలేశాడు” అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయినా కూడా మెగా అభిమానులు మాత్రం ఆమెకు బలమైన మద్దతుగా నిలుస్తున్నారు. “ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా, లైఫ్‌లో సక్సెస్ దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. అదే ఆమె ధైర్యం, అదే మెగా బ్లడ్” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిహారిక మాత్రం ఈ విషయంపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ, ఆమె ఫోకస్ మాత్రం కొత్త ప్రాజెక్టులపైనే ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను బలంగా స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో, ఎప్పుడు షూట్ చేశారో అన్న క్లారిటీ వచ్చే వరకు ఈ చర్చ ఆగేలా లేదు.