బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి . ఇక ఈ తరహాలోనే కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా మూవీ డ్యూడ్ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది . ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ను సంపాదించుకుంది కూడా . యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండగా అటు తమిళనాడులో మరియు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ మంచి జోరు మీద కొనసాగుతుంది .


ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత లో పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కూడా దీపావళి మూవీస్ లో బెస్ట్ ట్రెండ్ను చూపెడుతూ ఉండగా మొదటి రోజు ఇక్కడ 1.25 , 1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం తమిళ్లో మంచి ట్రెండ్ ను కొనసాగిస్తూ అక్కడ ప్రదీప్ రంగనాథన్ కర్రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తుంది . డ్రాగన్ మూవీ 5.75 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెచ్చి పెట్టగా.. ఇక ఇప్పుడు క్యూట్ మూవీ ఈ మార్క్ ని దాటేసే అవకాశం ఏమాత్రం మించిపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి .


కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా పర్వాలేదు అనిపిస్తున్న ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా డీసెంట్ ట్రెండ్ను చూపెడుతూ కొనసాగుతుంది . వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డబల్ డిజిట్ మార్క్ ని దాటేసి డ్రాగన్ ని మించిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి . డ్రాగన్ మొదటి రోజు 11 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను అందుకోగా ఇప్పుడు ఈ మార్క్ ని దాటేసి డ్యూడ్ అఫీషియల్ గా 13 నుంచి 14 కోట్ల రేంజ్ లో ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోస్తుంది . ఇది ప్రదీప్ రంగనాథన్ కెరీర్ కి మంచి మార్క్ అని చెప్పుకోవచ్చు . మొదటి రోజే ఈ మూవీ 14 కోట్ల వరకు రాబట్టిందంటే రానున్న రోజుల్లో పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవటం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: