తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టించే వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన ఏదైనా మాట్లాడినా కూడా అది వివాదమే అవుతుంది.ఎందుకంటే మాట్లాడేటప్పుడు అలాంటి వివాదాన్ని సృష్టించే మాటలు మాట్లాడతారు. అయితే అలాంటి బండ్ల గణేష్ దీపావళి పండగ వచ్చిందంటే చాలు బాంబులు పేలుస్తూ రికార్డు సృష్టించాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా దీపావళి పార్టీ రావడంతో అందరి చూపు బండ్ల గణేష్ పైనే ఉంది. ఈసారి దీపావళికి ఏం చేస్తారా అని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఈసారి క్రాకర్స్ తో రికార్డు సృష్టించడమే కాదు ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలందరిని తన ఇంటికి ఆహ్వానించి పార్టీ ఇవ్వబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి ఓ వార్త వినిపిస్తోంది. అంతేకాదు బండ్ల గణేష్ ఇంటికి చీఫ్ గెస్ట్ గా దివాళీ బాష్ కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తారనే రూమర్లు వినిపిస్తున్నాయి. 

ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మెగాస్టార్ ని మాత్రం చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అలాగే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరికీ ఆహ్వానం పంపి వారికి పార్టీ ఇవ్వాలని చూస్తున్నారట.మరి అంతా ఓకే గాని ఆ టాప్ సెలబ్రిటీ వస్తారా అంటూ ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరి ఇంతకీ ఆ టాప్ సెలబ్రిటీ ఎవరయ్యా అంటే ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో ఈయన కూడా ఒకరు.అయితే అలాంటి అల్లు అరవింద్ తో ఈ మధ్యకాలంలో బండ్లన్న కి కాస్త గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ లిటిల్ హార్ట్స్  మూవీ సక్సెస్ ఈవెంట్ కి వెళ్లి అక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడేలా మాట్లాడారు. ముఖ్యంగా అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఆయన సన్నిహితులకు నచ్చలేదు.

 అంతేకాకుండా బన్నీ వాసు తన మిత్రమండలి మూవీ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని మొత్తం కక్కేసారు. బండ్ల గణేష్ మాటలు మాక్కూడా కాస్త ఇబ్బందిగా అనిపించాయని చెప్పారు. ఇక బన్నీ వాసు మాటలకి బండ్ల గణేష్ మిత్రమండలి మూవీ విడుదలైన వెంటనే ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి మూవీ టాక్ ఎలా ఉందో ఒక ట్వీట్ పెట్టాడు. అది పీకుతా ఇది పీకుతా అని కాదు మనం పీకేది ఏమీ ఉండదు అంతా జనాల చేతుల్లోనే ఉంటుంది అని సెన్సేషనల్ ట్వీట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్ బన్నీ వాసుని ఉద్దేశించే బండ్లన్న పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ ఇంట్లో దివాళీ బాష్ కి అల్లు అరవింద్ ని ఆహ్వానిస్తారా అనే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి నిజంగానే బండ్లన్న దీపావళి బాష్  పేరుతో పార్టీ ఇస్తారా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: