
ఇక ఇందులో నీ తొలిముద్దు ఎవరికి ఇచ్చావు అని రానా అడగడంతో నిర్మూహమాటంగా చైతు సమాధానమిచ్చాడు . నేను 9వ క్లాసులో ఉన్నప్పుడే ఓ అమ్మాయికి ముద్దు ఇచ్చానంటూ చెప్పడం జరిగింది . ఇక అమ్మాయిని నేను డీప్ గా లవ్ చేశాను అని ఆమెకి ముద్దు కూడా ఇచ్చాను అని .. ఆ ముద్దు నా లైఫ్ మొత్తం పని చేసింది .. కానీ ఆమె నా లైఫ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యాడు నాగ చైతన్య . ఇక నాగచైతన్య కామెంట్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు .
చైతు సమంతతో విడాకులు అనంతరం శోభితను పెళ్లి చేసుకుని ప్రజెంట్ లైఫ్ సెటిల్ చేసుకున్న సంగతి తెలుస్తుంది . ప్రస్తుతం ఒకపక్క ఫ్యామిలీ లైఫ్ ను మరోపక్క సినీ జీవితాన్ని కూడా కొనసాగిస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు . ఇక సమంతా నాగచైతన్య జంటకి ఉన్న క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే . వీరిద్దరూ ఫ్యాన్స్ వీరు విడిపోయిన తర్వాత చాలా బాధపడ్డారని చెప్పుకోవచ్చు . ఇక చాలాకాలం మళ్లీ కలుస్తారేమోనని చూడడం కూడా జరిగింది . కానీ ఉన్నట్టుండి శోభితాను చైతు వివాహం చేసుకోవడంతో ఈ ఆసులకు అడ్డు కట్టబడిందని చెప్పొచ్చు . ప్రస్తుతం సమంత సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ తన క్రేజ్ లోకి రావడానికి ప్రయత్నిస్తుంది .