సిడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 12 మూవీస్ ఏవి ..? అందులో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి మూవీ ఏ ప్లేస్ లో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి సీడెడ్ ఏరియాలో 35.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ సీడెడ్ ఏరియాలో 34.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి సీడెడ్ ఏరియాలో 31.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ కి సీడెడ్ ఏరియాలో 22.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ కి సీడెడ్ ఏరియాలో 21.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీడెడ్ ఏరియాలో 19.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ కి 19.11 కోట్ల కలెక్షన్లు దక్కాయి. చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ కి 18.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. అల్లు అర్జున్ హీరో గా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమాకు 18.27 కోట్ల కలెక్షన్లు దక్కాయి. పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి మూవీ కి సీడెడ్ ఏరియాలో ఇప్పటివరకు 17.78 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా సీడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసులు చేసిన సినిమాల లిస్టులో 12 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: