టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం క అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా కిరణ్ అబ్బవరం కు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. క లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ఈయన దిల్రుబా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. కిరణ్ తాజాగా కే ర్యాంప్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 18 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 1.25 కోట్లు , ఆంధ్ర లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 6.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 60 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఓవర్సీస్ లో 1.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ 9 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: