టాలీవుడ్ బుల్లితెర యాంకర్ గా ,నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రంగస్థలం సినిమాతో అనసూయ నటనకు పేరు రావడంతో అప్పటి నుంచి పలు సినిమాలలో ఈమెకు అవకాశాలు పెరిగిపోయాయి. దీంతో డేట్లను అడ్జస్ట్ చేయలేక ఏకంగా టీవీ షోలకే గుడ్ బై చెప్పినట్లు వినిపించాయి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న అనసూయ తన పైన నెగటివ్ కామెంట్స్ చేసే వారికి అదిరిపోయే కౌంటర్స్ వేస్తూ ఉంటుంది.


తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మేనేజర్ ని తొలగించినట్లుగా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. తనకి మేనేజర్ గా పనిచేసినటువంటి మహేంద్ర గారు రివిల్ అయ్యారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది అనసూయ. నాకు మేనేజర్ గా పనిచేసినటువంటి మిస్టర్ మహేంద్ర, తన సుదీర్ఘ ప్రయాణం, వృత్తిపరమైన ప్రయాణం తర్వాత ఆయన రివిల్ అయ్యారంటూ తెలిపారు. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో  ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపింది.



ఇన్ని రోజులు నాకు మేనేజర్ గా ఆయన చేసిన సహాయం, కృషి కి మహేంద్రకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాసుకొచ్చింది. ఈ విషయం పైన కొంతమంది నెటిజన్స్ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. రివిల్ అని అంటారు ఎందుకు మేడమ్.. మేనేజర్ రిజైన్ చేసి ఈ గోల నుంచి తప్పించుకున్నానని ఆనందపడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది తెలివైనవాడు బ్రతికిపోయాడు అంటు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సంచలనంగా మారింది. కానీ అనసూయ తన మేనేజర్ ఎందుకు రిజైన్ చేశారని విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: