తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు తన బ్యానర్లో బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే టైటిల్తో ఓ సినిమా చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. మొదటగా ఎల్లమ్మ ప్రాజెక్టు కి సంబంధించి వార్తలు వచ్చిన సమయంలో బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ అనే టైటిల్తో నాని హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలో కొంత కాలం పాటు అలాగే సాగాయి. అలాంటి సమయం లోనే నాని కి బలగం వేణు చెప్పిన ఎల్లమ్మ మూవీ కథ అంత బాగా నచ్చలేదు అని ఆల్రెడీ ఆయన చేసిన దసరా సినిమా కథకు అది దగ్గరగా ఉండడంతో ఆయన ఆ మూవీ నుండి తప్పుకున్నాడు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ అనే టైటిల్ తో నితిన్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు అనుగుణం గానే ఓ ఈవెంట్లో భాగంగా దిల్ రాజు , నితిన్ హీరోగా వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా నితిన్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎల్లమ్మ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరో గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఓ వార్త ప్రస్తుతం బలంగా వైరల్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీత దర్శకుడు. ఆయన ఎంతో మంది సినిమాలకు సంగీతం అందించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ఎల్లమ్మ సినిమాలో ఆయన హీరోగా అయితే ఆయనే ఆ మూవీ కి సంగీతం కూడా అందిస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎల్లమ్మ సినిమాకు సంబంధించి చాలా కాలం క్రితమే అజయ్ ,  అతుల్  కి దిల్ రాజు  పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఎల్లమ్మ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించిన సంగీతం మాత్రం ఆయన అందిస్తాడా ..? లేదా  ..? అనే అనుమానాలు చాలా మంది లో ప్రస్తుతం నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: