సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండక్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సినిమాలో విడుదల అవుతూ ఉంటాయి. దానితో చాలా మంది ఆ సమయంలో సినిమాలు చూడడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. దానితో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి కూడా చాలా సినిమాలు విడుదల కానున్నాయి.

వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ , చిరంజీవి హీరో గా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ , నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు , రవితేజ హీరో గా   కిషోర్ తిరుమల దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాను , శర్వానంద్ హీరో గా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్ , శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న పరాశక్తి మూవీలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలలో రవితేజ హీరో గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మరియు శర్వానంద్ హీరో గా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి భరి నుండి తప్పుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు చాలా తెలుగు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉండడంతో డబ్బింగ్ సినిమాలు అయినటువంటి జన నాయగన్ , పరాశక్తి మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లు దొరకడం చాలా కష్టం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: