ధన్య మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తానేనని. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే కేవలం నటనతో ఒక్కటే కాలేము, కొన్నిసార్లు గ్లామర్ కూడా అవసరం అవుతుంది. కానీ తాను ఆధారి ఎంచుకోలేదు, గ్లామర్ లేదా బోల్డ్ సీన్స్ లలో నటించడానికి తాను అంగీకరించలేదని అందుకే తనకు మంచి అవకాశాలు కూడా చేజారిపోయాయంటూ వెల్లడించింది. మొదట్లో తనకు కూడా ఈ విషయంపై చాలా బాధ వేసేది!ఎందుకు నేను ఎదగలేకపోతున్నానని ఎక్కువగా ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు అర్థమైంది నేను తీసుకుని నిర్ణయాలు తనని ఈ మార్గంలో ఉంఛాయని, తన కుటుంబం చాలా సాంప్రదాయంగా ఉంటుంది,చిన్న వయసు నుంచే అలాంటి వాతావరణంలో పెరిగాను అందుకే తాను చేసే ప్రతి సినిమా ముందు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చేస్తానని తెలిపింది.
కొన్ని పాత్రలు తిరస్కరించడానికి కూడా తన కుటుంబమే కారణమని, తనకి కుటుంబ విలువలతో నన్ను గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యము నమ్మకం అంటూ ధన్య తెలియజేసింది. తాజాగా ధన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది ధన్య నిర్ణయం పట్ల ప్రశంసిస్తున్నారు. మరి కొంత మంది ఎలాంటి విషయాలనైనా సరే ధన్య ఓపెన్ గా మాట్లాడేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో తాను ఎవరు మీద ఆధారపడలేదు నా దారి నేనే వెతికాను అంటూ తెలిపింది. ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే భవిష్యత్తులో తనని కొత్తగా చూపించే అవకాశాలు ఉంటాయని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి