తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పుడే అసలైన రణరంగం మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి భరణి, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. దీంతో ఇద్దరికీ పెట్టిన టాస్కులలో అటు భరణికి తీవ్రమైన గాయాలు అవ్వడంతో హాస్పిటల్ పాలైనట్లుగా కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే వైల్డ్ కార్డు ఎంట్రీ లో ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న దివ్వెల మాదిరి, రీ ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ ఓ రేంజ్ లో గొడవలు పడుతున్నారు.



ముఖ్యంగా దువ్వాడ మాదిరి ఎవరో నీకు తెలియకపోతే బయటకు వెళ్లి అడుగు అంటూ శ్రీజ కి కౌంటర్ వేసిన మాధురి.. మాధురి అంటే ఎవరో తెలియదు అంటున్నారు! నాకే కాదు బయట చాలా మందికి తెలియదు అంటూ  దమ్ము శ్రీజ పంచ్ వేసింది. ఈ విషయం పైన దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా ఆమెను మాదిరి ఎలిమినేట్ చేయలేదు. హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెన్స్ ఆమెను ఎలిమినేట్ చేశారంటు తెలిపారు.


మాధురి ఎవరో తెలియదని చెప్పినందుకు ఆమెను బయటకు పంపించలేదు, హౌస్ లో చిన్నపిల్లలను మాధురి అంతగా పట్టించకొదు . కానీ దమ్ము శ్రీజది మాత్రం వైజాగ్, ఆమె ఇంటి డోర్ నెంబర్ తో సహా నాకు బాగా తెలుసు, వాళ్ళ నాన్న , వాళ్ల ఫ్యామిలీ గురించి మొత్తం నాకు తెలుసు తెలియకపోతే అడిగే పద్ధతి మరోలా ఉంటుంది. మీరు నాకు పరిచయం లేదు. కాబట్టి మీ గురించి నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నానని అడగాలంటూ తెలిపారు. మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న వారందరు భయపడిపోతున్నారు. చమటలు పట్టేలా చేస్తోంది? ఎలా మాట్లాడాలి? ఎలా తట్టుకోవాలనే హడావిడితోనే ఉన్నారంటు తెలిపారు. కేవలం శ్రీజ మాధురి ఎవరో తెలియదని చెబితేనే క్రేజ్ పెరుగుతుందని ఆలోచేస్తోంది. శ్రీజ చాలా అహంకారంతో ఆడింది అందుకే మాధురి నుంచి ఆమెకు అలాంటి జవాబులు వస్తున్నాయంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: