 
                                
                                
                                
                            
                        
                        పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బాహుబలి : ది ఎపిక్ రీ రిలీజ్ చివరికి ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినిమాటిక్ హిస్టరీ లో ఒక లెజెండరీ స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు, రెండు భాగాలను కలిపి, రీ - ఎడిట్ చేసి, రీ - మాస్టర్ చేసిన ఈ కొత్త వెర్షన్ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ప్రదర్శనలు ప్రారంభమైన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే “ బాహుబలి మళ్లీ చూసినా కొత్త అనుభూతి కలిగించింది ”, “ సౌండ్, విజువల్స్ , కలర్ టోన్ అంతా కొత్తగా, మరింత గ్రాండ్గా కనిపించాయి ” అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. 4K డాల్బీ విజువల్ క్వాలిటీతో స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఫ్రేమ్ అబ్బురపరుస్తోంది.
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటనలతో పాటు రాజమౌళి తీసిన ఎపిక్ స్కేల్ విజువల్స్ మళ్లీ ప్రేక్షకులను మాయలోకి లాక్కెళ్తున్నాయి. ఇక థియేటర్లలో క్యూలైన్లు, హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం చూస్తేనే ఈ రీ రిలీజ్ ఎంతటి క్రేజ్ క్రియేట్ చేసిందో అర్థమవుతుంది. అదేవిధంగా , బాహుబలి యానిమేషన్ సిరీస్ టీజర్ కూడా ఈ సందర్భంలో విడుదల చేయడంతో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. టీజర్‌లో చూపించిన విజువల్స్ , క్యారెక్టర్స్ డిజైన్‌కి మంచి అప్రిసియేషన్ లభిస్తోంది. మొత్తానికి చూస్తే, బాహుబలి: ది ఎపిక్ రీ రిలీజ్ ప్రేక్షకులను మరోసారి ఆ మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్లి, రాజమౌళి ప్రతిభను మళ్లీ గుర్తు చేసిందనే చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి