 
                                
                                
                                
                            
                        
                        సుకుమార్ తో సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే టాలీవుడ్లో ఒక డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా అంటే అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. ముఖ్యంగా అభిమానులే ఆ డైరెక్టర్ తో సినిమా వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మెహర్ రమేష్.
టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన మెహర్ రమేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలలో ఎక్కువగా డిజాస్టర్లే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమా తప్ప మరే సినిమా ఇతర హీరో అభిమానులను ఆకట్టుకోలేదు. చివరిగా చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన ఇది కూడా అభిమానులను నిరాశపరిచింది. అలా డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమాలు చేసిన హీరోల విషయానికి వస్తే వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి హీరోలతో చేశారు. ఇందులో ఎన్టీఆర్ తో శక్తి, కంత్రి సినిమాలు చేయగా రెండు డిజాస్టర్లుగానే మిగిలాయి. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా అనే టాక్ వినిపించగానే అభిమానులు కంగారు పడుతున్నారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి